భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే.. మ్యాచ్ని టీవీలో, ఫోన్లో లైవ్ ఇక్కడ చూడొచ్చు!  

భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే.. మ్యాచ్ని టీవీలో, ఫోన్లో లైవ్ ఇక్కడ చూడొచ్చు!  

India vs New Zealand 2nd ODI: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు (శనివారం, నవంబర్ 7, 2026) రెండో మ్యాచ్ జరగనుంది. ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించాలని టీమిండియా చూస్తుండగా, ఈ పోరులో గెలిచి సిరీస్ సమం చేయాలని బ్లాక్ క్యాప్స్ టీమ్ చూస్తోంది. దీంతో రేపటి మ్యాచులో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠంగా మారింది. 

రెండో విజయంపై గిల్ సేన నజర్: 

ఇప్పటికే తొలి వన్డేలో గెలిచి 1–0 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. వెల్లింగ్టన్ వేదికగా జరిగే ఈ రెండో వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది.   

కంబ్యాక్ కోసం కివీస్ పోరాటం:

సొంతగడ్డపై ఆడుతున్న మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తోంది. తొలి వన్డేలో భారత బౌలింగ్ ధాటికి కుప్పకూలిన కివీస్ బ్యాటింగ్ లైనప్, ఈ మ్యాచ్‌లో తమ లోపాలను సరిదిద్దుకుని భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

2nd ODI మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్: 

* తేదీ, వేదిక: శనివారం, నవంబర్ 7, 2026 | హెన్రీ స్టేడియం (Hnry Stadium - పాత పేరు స్కై స్టేడియం), వెల్లింగ్టన్, న్యూజిలాండ్

* మ్యాచ్ సమయం: ఉదయం 7:30 AM (IST) (టాస్: 7:00 AM IST)

* లైవ్ టీవీ టెలికాస్ట్ (TV): భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం.

* లైవ్ స్ట్రీమింగ్ (OTT): Sony LIV యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.