Netflix Top 10 India : ఓటీటీలో దూసుకెళ్తున్న 'బత్తా'.. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో ఏయే సినిమాలున్నాయంటే?

Netflix Top 10 India : ఓటీటీలో దూసుకెళ్తున్న 'బత్తా'.. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో ఏయే సినిమాలున్నాయంటే?

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సినిమాల మధ్య పోటీ రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రాలే కాకుండా.. నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న చిన్న సినిమాలు సైతం ప్రేక్షకుల ఆదరణతో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొస్తున్నాయి. మరో వైపు ఓటీటీలో ఏ సినిమా ఎక్కువ మంది చూస్తున్నారు? ఏ మూవీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది.

ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి.. బాక్సాఫీస్ వద్ద బొల్తాపడ్డ చిత్రాలు సైతం ఓటీటీలో దూసుకెళ్తుంటాయి.  ప్రస్తుతం నవంబర్ 5, 2026 నాటి టాప్ 10 జాబితా ప్రకారం 'బత్తా'(Baththa) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక రెండో స్థానంలో 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', మూడో స్థానంలో 'సిగ్మా' నిలిచాయి. విభిన్న భాషలు, విభిన్న కథాంశాలతో వచ్చిన ఈ సినిమాలు ఇండియలో నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాలు

టాప్ వన్ లో 'బత్తా' ( Baththa )

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బత్తా' అక్టోబర్ 1 తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలాజీ ధరణీధరన్ దర్శకత్వంలో తెరెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 29వ తేదీ నుంచి'నెట్ ఫ్లిక్స్''లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చింది. 

ఈ తమిళ డ్రామా కథ 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. ఓ చిన్న బాలుడు అనుకోకుండా ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను స్కూల్ టాయిలెట్‌లో బంధిస్తాడు. అక్కడ మొదలయ్యే విచిత్రమైన పరిచయం ఇద్దరి జీవితాలను ఎలా మార్చిందనేదే కథ. ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు లిజోమోల్ జోస్, మాస్టర్ సాయి పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. 

 

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్  ( Don't Trouble the Trouble )

మలయాళ వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' .  అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చింది. రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  ఫహాద్ ఫాజిల్ తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవా, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలో నటించారు.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయింది. కానీ అక్టోబర్ 30, 2026 నుండి ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం టాప్ 2లో దూసుకెళ్తోంది.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో సూరి అనే చిన్న దొంగ, దివ్య అనే మాయా శక్తులున్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె తప్పిపోయిన తల్లిదండ్రులను వెతికే ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది.

 

టాప్ 3లో 'సిగ్మా' ( Sigma) 

తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలిసారి మెగాఫోన్ పట్టిన మూవీ 'సిగ్మా' (Sigma)  అక్టోబర్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. దర్శకుడిగా జేసన్ తొలి ప్రయత్నం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. కానీ అక్టోబర్ 30 తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఇండియాలో టాప్ 3లో కొనసాగుతోంది.

 లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ హై-ఓల్టేజ్ యాక్షన్-అడ్వెంచర్ అండ్ హీస్ట్ థ్రిల్లర్‌లో యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్‌లో అలరించారు.  ఇధి యాక్షన్ కామెడీ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. తల్లి నడిపిన లైబ్రరీని కాపాడేందుకు అప్పులతో పోరాడుతున్న గురు చేతికి గ్యాంగ్‌స్టర్ రహస్య సంపదకు సంబంధించిన తాళం చెవి చిక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఆసక్తికరం. 

గజబ్ రాత్ ( Gajab Raat )

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'.  2026 అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితేష్ షా దర్శకత్వంలో  తెరకెక్కించిన ఈ చిత్రంలో మనోజ్ బాజ్ పేయి తో పాటు దివ్వ దత్తా, సాకిబ్ సలీమ్, నుష్రత్ భరుచా, అక్షయ్ ఒబేరాయ్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలో నటించారు.  ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఒక రాత్రి జరగే హై వోల్టేజ్ డ్రామా ఇది.

ఒకే రాత్రిలో చోటుచేసుకునే సంఘటనలు, పోలీసు వ్యవస్థలో అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు, అనూహ్య మలుపులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పేయి ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒకే రాత్రిలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది..

 

'మీటే హే క్యాహై' ( Meethe Mein Kya Hai )

హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం మీటే మే క్యా హై’ (Meethe Mein Kya Hai)  . రాధికా బన్సాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిత్విక్ భౌమిక్, రోహిణి హట్టంగడి, ఆయేషా రజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భార్యను కోల్పోయిన ఓ యువకుడు దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలుస్తాడు. ఈ క్రమంలో అతడి సోదరి రహస్య వివాహం బయటపడటంతో కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ బంధాలతో కథ సాగుతుంది. ఈ సినిమా 2026 అక్టోబర్ 30న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది.. హిందీతో పాటు తెలుగు, తమిళ ఆడియోల్లోనూ అందుబాటులో ఉంది. 

 

 'అవరాచన్ అండ్ సన్స్' ( Avaraachan & Sons )

బిజు మీనన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'అవరాచన్ అండ్ సన్స్' (Avaraachan & Sons) . తంబి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనాథ్ భాసి, గణపతి, గ్రేస్ ఆంటోనీ, వినయ్ ఫోర్ట్ కీలక పాత్రల్లో నటించారు. చెళ్లానం నేపథ్యంలో సాగే ఈ కథలో అవరాచన్ అనే బాధ్యతారహితమైన తండ్రి, అతడి ఇద్దరు కుమారుల మధ్య ఉండే విభేదాలు, కుటుంబ సమస్యలు ప్రధానంగా ఉంటాయి. తన ప్రవర్తనతో కుటుంబానికి ఇబ్బందులు తెచ్చే అవరాచన్ జీవితంలో చోటుచేసుకునే మార్పులే కథాంశం. 

ఈ సినిమా 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆడియో అందుబాటులో ఉంది.  మలయాళ కుటుంబ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కూడా టాప్ 10లో చోటు దక్కించుకుంది. కుటుంబ కథలు, ప్రాంతీయ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

'డోరతీ’ (Dorothy)

ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తమిళ సోషల్ డ్రామా 'డోరతీ’ (Dorothy) . ఈ సినిమాలో కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1990ల నాటి మధురై నేపథ్యంలో సాగే ఈ కథలో కుల వివక్ష, పురుషాధిక్య భావజాలం, ట్రాన్స్‌జెండర్ల జీవితాలు, మానవ సంబంధాలను ఆసక్తికరంగా చూపించారు. ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి డోరతీ అనే మహిళ ప్రవేశించిన తర్వాత వారి ఆలోచనా విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేదే కథాంశం. 

ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 

 సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ( Sub-Inspector Yugandhar )

ఆది సాయికుమార్ హీరోగా నటించిన తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ( Sub-Inspector Yugandhar ). రాఘవేంద్ర కటారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘలేఖ, రకేందుమౌళి, పవన్ తేజ్ కొణిదెల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పోలీసుల కస్టడీ నుంచి మాయమైన ఓ మృతదేహం అనూహ్య పరిస్థితుల్లో బయటపడటంతో కథ మొదలవుతుంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై యుగంధర్‌కు ఎన్నో రహస్యాలు, ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఈ క్రమంలో బయటపడే నేరాల వెనుక అసలు వ్యక్తి ఎవరు? అనేదే ఆసక్తికరమైన కథాంశం. ఈ సినిమా  అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది ప్యారడైజ్ (  The Paradise )

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'  The Paradise. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని జడల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడే అణగారిన సమాజం జీవితాలను చూపించారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలీ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. 

ఈ సినిమా 2026 సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌ను సుమారు 24 నిమిషాలు తగ్గించి విడుదల చేయడం విశేషం. నాని నటించిన ఈ తెలుగు సినిమా కూడా టాప్ 10లో కొనసాగుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

'కొలిజన్ కోర్స్'(Collision Course)

 డేనియల్ సాంచెజ్ అరేవాలో దర్శకత్వం వహించిన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ 'కొలిజన్ కోర్స్'(Collision Course). లైయా కోస్టా, కారా ఎలెహాల్డే, లూయిస్ జహెరా, అల్వారో సెర్వాంటెస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్పెయిన్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మాడ్రిడ్‌లోని ఓ బ్యాంకులో దోపిడీ జరుగుతుంది. ఆ తర్వాత జరిగే కారు ప్రమాదం దొంగల మధ్య దాగి ఉన్న మోసాలు, ద్రోహాలు, రహస్యాలను బయటపెడుతుంది. ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా 2026 అక్టోబర్ 30న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

మొత్తంగా చూస్తే ఈ జాబితాలో  విజయ్ సేతుపతి నటించిన 'బత్తా', ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', సందీప్ కిషన్ 'సిగ్మా' వంటి ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు విభిన్నమైన వినోదాన్ని అందిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి 'గజబ్ రాత్', 'కొలిజన్ కోర్స్' మంచి ఎంపికలు కావచ్చు. కుటుంబ కథలు ఇష్టపడేవారు'మీటే మే క్యా హై'ను ప్రయత్నించవచ్చు.