బాంబు బెదిరింపులతో ముంబై సిటీ హై అలర్ట్ : వీళ్లందరికీ కాల్స్ వచ్చాయి

బాంబు బెదిరింపులతో ముంబై సిటీ హై అలర్ట్ : వీళ్లందరికీ కాల్స్ వచ్చాయి

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం, బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రధాన కార్యాలయం, వర్లీ రేస్‌కోర్స్‌ లక్ష్యంగా బాంబు దాడులు జరుగుతాయని హెచ్చరిస్తూ శుక్రవారం (నవంబర్ 6) కోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్ అందింది. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడంతో పాటు భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ ఇళ్లు, బాంబే హైకోర్టు, బీఎస్ఈ కార్యాలయంలో బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది ముమ్మరంగా సోదాలు చేపట్టారు. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ALSO READ : డాక్టర్ను ఇంటికి పిలిపించి లక్షలు దోచేసిన కేసులో మత్తు వదలరా సినిమా నటి అరెస్ట్ !

మరోవైపు.. బాంబు బెదిరింపు హెచ్చరికలు చేస్తూ ఈ-మెయిల్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు నేపథ్యంలో బాలీవుడ్ నటులకు వరుసగా వస్తోన్న థ్రెట్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్టర్ టైగర్ ష్రాప్‎పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే  నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు బెదిరింపులు వచ్చాయి.