అంతా టెక్నాలజీ.. ఇప్పటికే రోబోలు వచ్చి మనుషులకు పని ఉండటం లేదు.. దీనికితోడు మొన్నటికి మొన్న ఎలన్ మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తీసుకొచ్చాడు.. నిన్న ఏమో ఎగిరే కార్లు తీసుకొచ్చాడు. దీన్ని చూసిన చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తీసుకొచ్చారు.. మా పెతాపం చూడండీ అంటూ.. ఏకంగా సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు తీసుకొచ్చింది. ఇప్పటికే చైనాలో టెస్టింగ్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లను.. త్వరలో విడుదల చేయబోతుందంట.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ కొత్త రకం బండ్ల గురించి పూర్తిగా తెలుసుకుందామా..
చైనా టెక్నాలజీ రంగంలో మరో సంచలన సృష్టికి సిద్ధమైంది. ఇప్పటికే ఆటోమొబైల్, రోబోటిక్స్ రంగాల్లో దూసుకుపోతున్న డ్రాగన్ కంట్రీ.. తాజాగా ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా తనంతట తానుగా నడిచే సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా చైనా తీసుకువస్తున్న ఈ నూతన ఆటోమొబైల్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ స్కూటర్ ప్రత్యేకతలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. దీనికి ఎలాంటి రైడర్ అవసరం లేదు. కేవలం మొబైల్‌లో బండెక్కి బటన్ నొక్కితే చాలంట.. ఈ స్కూటర్ నేరుగా మీ వద్దకు వస్తుంది. అలాగే ప్రయాణంలో మార్గమధ్యలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే వాటిని ఇంటెలిజెంట్ సెన్సార్లు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సహాయంతో ఇన్‌స్టంట్‌గా గుర్తించి పక్కకు తప్పుకుంటుంది. ఇక దీనికి మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎవరైనా ఢీకొట్టినా ఇది కిందపడిపోకుండా తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకుని నిలబడుతుందట.
ALSO READ : పాకిస్థానీలు, శ్రీలంక తమిళులు, టిబెటన్లకు కొత్త ఇమిగ్రేషన్ రూల్స్.. కేంద్రం బిగ్ రిలీఫ్!
🇨🇳 CHINA SHOWCASES A SELF-DRIVING ELECTRIC SCOOTER The scooter can detect and avoid obstacles, stay upright when struck, and come to you with a single tap. https://t.co/nAHLSMPqxm
— KOSO🇳🇬 (@KosoNwa1) October 11, 2026
2 చక్రాల వాహనాలకు సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన విషయం. అయితే చైనా ఇంజనీర్లు ఈ సవాల్‌ను విజయవంతంగా అధిగమించారు. ఫ్యాక్టరీ రోబోట్లు, సెల్ఫ్-డ్రైవింగ్ కార్లలో వాడుతున్న అధునాతన ఏఐ టెక్నాలజీని ఈ లైట్ వెహికల్స్‌కు జోడించారు. భవిష్యత్తులో అర్బన్ లాజిస్టిక్స్, నగరాల్లో రవాణా అవసరాలకు ఈ సెల్ఫ్-డ్రైవింగ్ టూ-వీలర్లు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.
టెక్నాలజీ పురోగతితో రాబోయే రోజుల్లో మన రోడ్లపై డ్రైవర్ లెస్ వాహనాలు పరుగులు పెట్టడం ఖాయమని చైనా దీంతో నిరూపిస్తోంది. భవిష్యత్తు మొబిలిటీ రంగంలో చైనా తీసుకువస్తున్న ఈ విప్లవాత్మక మార్పులు రవాణా వ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాయని ఆటో నిపుణులు అంటున్నారు.
