టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ తనిఖీలు.. హాస్పిటళ్లకు తాళాలు..మహబూబాబాద్‌‌‌‌ లో అక్రమ స్కానింగ్‌‌‌‌లు, అబార్షన్ల గుర్తింపు

టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ తనిఖీలు.. హాస్పిటళ్లకు తాళాలు..మహబూబాబాద్‌‌‌‌ లో అక్రమ స్కానింగ్‌‌‌‌లు, అబార్షన్ల గుర్తింపు

మహబూబాబాద్‍, వెలుగు: మహబూబాబాద్‍ జిల్లాలో అక్రమ అబార్షన్లు జరుగుతున్నాయనే సమాచారంతో శుక్రవారం వైద్య, పోలీస్‌‌‌‌, రెవెన్యూ శాఖలతో కూడిన టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ బృందం ప్రైవేట్‌‌‌‌ హాస్పిటళ్లలో తనిఖీలు చేపట్టింది. ముందస్తు సమాచారం అందడంతో పలు హాస్పిటళ్లు, ల్యాబ్‌‌‌‌లు, స్కానింగ్‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులు తాళాలు వేసి వెళ్లిపోయారు. మహబూబాబాద్‌‌‌‌తోపాటు తొర్రూర్‌‌‌‌ తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. 

ముఖ్యంగా బాలికల గర్భధారణ కేసులపై దృష్టి పెట్టారు. హాస్పిటళ్లలో రికార్డులు పరిశీలించి, ఇటీవల డెలివరీ అయిన మహిళల వివరాలు సేకరించారు. చాలా చోట్ల సీసీ కెమెరాలు లేకపోవడాన్ని గుర్తించారు. అక్రమ అబార్షన్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల సమాచారం ముందే తెలియడంతో పలు హాస్పిటళ్లు మూసివేయడం చర్చనీయాంశంగా మారింది.