జయశంకర్ భూపాలపల్లి: ప్రియుడి మోజులో భర్త హత్య..వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్

జయశంకర్ భూపాలపల్లి: ప్రియుడి మోజులో భర్త హత్య..వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్
  •     గొడ్డలితో మెడ నరికి.. డెడ్​బాడీని అటవీ ప్రాంతంలో పడేసి పరార్​ 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ప్రియుడి మోజులో  భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం తండాలో జరిగింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అజ్మీర చందునాయక్(30),  పావని భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. కాగా, పావనికి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ధరావత్ సంతోష్ తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది.  

ఈవిషయంలో భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై మూడు రోజుల కింద చందునాయక్​ స్థానిక సర్పంచ్ ను సంప్రదించగా శుక్రవారం పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీలో తమ బాగోతం బయట పడుతుందని భావించిన పావని ప్రియుడు సంతోష్ తో కలిసి భర్త చందునాయక్ హత్యకు ప్లాన్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున  నిద్రపోయిన చందునాయక్ మెడపై ఇద్దరూ కలిసి గొడ్డలితో దాడి చేశారు. అనంతరం డెడ్​బాడీని ఎడ్ల బండిపై సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న భూపాలపల్లి డీఏస్పీ సంపత్ రావు, భూపాలపల్లి, గణపురం సీఐలు సీహెచ్ శ్రీనివాస్, కర్ణాకర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.