ఆస్టర్‌‌‌‌ డీఎం క్వాలిటీ కేర్‌‌‌‌ ఆదాయం రూ.2,829 కోట్లు

ఆస్టర్‌‌‌‌ డీఎం క్వాలిటీ కేర్‌‌‌‌ ఆదాయం రూ.2,829 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఆస్టర్‌‌‌‌ డీఎం క్వాలిటీ కేర్‌‌‌‌ ఆదాయం ఈ ఏడాది సెప్టెంబరు క్వార్టర్లో 19శాతం పెరిగి రూ.2,829 కోట్లకు చేరింది. నికర లాభం 34శాతం వృద్ధితో రూ.281 కోట్లకు చేరింది. ఆస్టర్‌‌‌‌ డీఎం హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌, క్వాలిటీ కేర్‌‌‌‌ విలీనం తర్వాత ఉమ్మడి సంస్థగా ప్రకటించిన తొలి ఫలితాలివి. ఈసారి 22 లక్షల మందికి వైద్యసేవలు అందించగా, రోగుల సంఖ్య 12శాతం పెరిగింది. పడకల వినియోగం 65శాతం నుంచి 68 శాతానికి చేరింది. విదేశీ రోగుల సంఖ్య 31శాతం వృద్ధి చెందింది.