హైదరాబాద్, వెలుగు: వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ నువామా నికరలాభం సెప్టెంబర్క్వార్టర్లో 26 శాతం పెరిగి రూ.319 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.254 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో లాభం 21 శాతం వృద్ధితో రూ.625 కోట్లకు చేరింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.937 కోట్లకు చేరింది.
గత సెప్టెంబర్ క్వార్టర్లో రూ.772 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్వహణ ఖర్చులు 16 శాతం పెరిగి రూ.507 కోట్లకు చేరాయి. వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగం లాభం 22 శాతం వృద్ధి చెందింది. క్లయింట్ అసెట్స్ మొత్తం విలువ 25 శాతం వృద్ధితో రూ.5.5 లక్షల కోట్లకు చేరిందని నువామా వెల్త్ ప్రకటించింది.
