హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఈకే మొబిలిటీ వచ్చే 18 నెలల్లో హైదరాబాద్‌లో మరో 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో మరో 15 షోరూమ్‌లు ప్రారంభించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ హైదరాబాద్ కాచిగూడలో శుక్రవారం రెండో షోరూమ్‌ను ప్రారంభించింది.
తెలంగాణలో ఈకే మొబిలిటీ వాహనాలకు అధీకృత డీలర్‌గా ఉన్న స్కెడ్ రైడ్స్ ఈ షోరూమ్‌ను నిర్వహించనుంది. ఇక్కడ ప్రధానంగా ఈ–ఆటోలను అమ్ముతారు. ఈకే కొత్త మోడల్ ఏవీఐ 3ఎస్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఏసీ, డీసీ చార్జింగ్, విశాలమైన ఇంటీరియర్స్ దీని ప్రత్యేకతలు. రాష్ట్ర ప్రభుత్వానికి 915 ఎలక్ట్రిక్ బస్సులను కూడా సరఫరా చేయనున్నామని ఈకే మొబిలిటీ తెలిపింది.
