టైసన్ నాయుడు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

టైసన్ నాయుడు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి జంటగా  సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్  బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం ‘టైసన్ నాయుడు’ . ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదల సిద్ధంగా ఉంది.  తాజాగా ఈ చిత్రం  నుంచి  ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ఫోక్ సాంగ్ క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటోంది. సురేష్ గంగుల లిరిక్స్ అందించగా, నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ కలిసి పాడారు. 

‘ఓ అచ్చం నల్ల చీర.. చీరంచున మల్లెమొగ్గ.. దానికొంగున కోడిపుంజు.. మదరాసి  రబ్బరు బొమ్మ.. దానిపైనే ఉంది మోజు.. మదరాసి  రబ్బరు బొమ్మ..  ఓ అచ్చం తెల్లపంచె.. దానంచున సీతాకోక.. దానిమనసున మాటే తెలుసు మధుమాసి బంగారు మామ..’  అంటూ సాగిన పాటలో సాయి శ్రీనివాస్, నేహా శెట్టి తమదైన డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. 

ఇద్దరి మధ్య   కెమిస్ట్రీ, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మంచి విజువల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌గా మార్చాయి. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీ ప్రత్యేకంగా ఉంది.   సినిమాలో సాయి శ్రీనివాస్ మునుపెన్నడూ చూడని మాస్ మేకోవర్‌‌‌‌‌‌‌‌తో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించనున్నారు.