స్లమ్ కుర్రాడి కథ ఛప్రి

స్లమ్ కుర్రాడి కథ ఛప్రి

మాంగళ్యం, పరాక్రమం,  నిర్భంధం  వంటి చిత్రాలతో నటుడిగా  గుర్తింపు తెచ్చుకున్న  సరోజ్ కుమార్ తాజాగా ‘ఛప్రి’ అనే  వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.  ఇందులో  సరోజ్ కుమార్  రా అండ్ రస్టిక్ లుక్‌లో యాక్షన్ మోడ్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.   

స్లమ్‌లో నివసించే ఓ యువకుడి ప్రేమకథ, అతని జీవితంలోకి ప్రవేశించే ధనవంతుల వల్ల ఎదురయ్యే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలియజేశాడు.  ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం వంటి బాధ్యతలన్నింటినీ సరోజ్ కుమారే నిర్వహించడం విశేషం. అలాగే  ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్‌తో కలిసి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.    

ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే మరిన్ని  వివరాలను వెల్లడించనున్నారు.