మహాకాళి మూవీ నుంచి అయిగిరి నందిని సాంగ్ రిలీజ్..

మహాకాళి మూవీ నుంచి అయిగిరి నందిని సాంగ్ రిలీజ్..

‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో మైథలాజికల్ మూవీ ‘మహాకాళి’.  భూమి శెట్టి మహాకాళిగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తోంది.  ప్రశాంత్ వర్మ షోరన్నర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.  ఆర్‌‌‌‌‌‌‌‌కే దుగ్గల్ సమర్పణలో రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అయిగిరి నందిని’ అంటూ సాగే అమ్మవారి పాటను విడుదల చేశారు మేకర్స్. 

ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ స్తోత్రానికి  మ్యూజికల్ టచ్ ఇస్తూ అమ్మవారి దివ్యశక్తిని ఇందులో చూపించారు.  స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాటను అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ కలిపి పాడిన విధానం ఆకట్టుకుంది. 

శ్రియా రెడ్డి, ఖుష్బూ సుందర్,  రోహిత్ సారఫ్, రాకేష్ బేడీ, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నాజర్  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ రాగా, సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.