ప్రతి అమ్మాయి కీర్తి పాత్రకు కనెక్ట్ అవుతుంది

ప్రతి అమ్మాయి కీర్తి పాత్రకు కనెక్ట్ అవుతుంది

‘ఛాంపియన్’ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు పరిచయమైన మలయాళ నటి అనస్వర రాజన్.. ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది.  అనీష్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని   నాగార్జున సమర్పణలో   మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  నవంబర్ 13న సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్  అనస్వర రాజన్ చెప్పిన విశేషాలు.

 ‘‘ఈ చిత్రంలో కీర్తి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చాలా యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా, ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ప్రతి అమ్మాయి ఈ పాత్రకు కనెక్ట్ అవుతుంది.  కథ విన్నప్పుడే కీర్తి పాత్రతో  మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇందులో అర్జున్ (అనీష్)  పాత్రకు మాటలు రావు. అతను తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అర్జున్, కీర్తి పాత్రలను ప్రేక్షకులు కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. 

అనీష్ తన తొలి సినిమాతోనే ఇలాంటి సవాల్‌‌‌‌‌‌‌‌తో కూడిన పాత్రను  చేయడం  అభినందనీయం. తన నటన, యాక్షన్, డ్యాన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు మహేష్‌‌‌‌‌‌‌‌కు కథపై మంచి క్లారిటీ ఉంది. ఆయన విజన్ నాకు బాగా నచ్చింది. వెంకీ కుడుముల ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా,  నాగార్జున ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించడం ఎంతో ఆనందాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. తమన్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. 

ఇందులో ప్రేమకథతో పాటు యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇక  మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి.  ప్రస్తుతం  చిరంజీవి గారి ‘కాకా’, రవితేజ గారి ‘తులాభారం’, సంగీత్ శోభన్‌‌‌‌‌‌‌‌తో ‘అంతా రాములోరు చూస్కుంటారు’ చిత్రాల్లో నటిస్తున్నా. మరికొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి’’.