నల్లగొండ: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.
ముందు వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మంచిర్యాల జిల్లా గుడిపేట పెట్రోల్ బంక్ సమీపంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
