సురేఖావాణి ప్రైవేట్ వీడియో వైరల్.. ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌పై నటి సంచలన పోస్ట్!

సురేఖావాణి ప్రైవేట్ వీడియో వైరల్.. ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌పై నటి సంచలన పోస్ట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సహాయ నటిగా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది.  ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫొటోలు, గ్లామరస్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా సురేఖావాణికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది.

మొదట ఈ వీడియో నిజమైనదా? ఏఐ సాయంతో సృష్టించారా? అనే చర్చ నెట్టింట మొదలైంది. కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వీడియోను వివిధ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్వయంగా స్పందించిన సురేఖావాణి అసలు విషయం వెల్లడిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత, ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చి వైరల్ అవుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కంటెంట్‌ను షేర్ చేయవద్దంటూ మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, ప్రెస్ సభ్యులను ప్రత్యేకంగా కోరారు. ఎవరైనా తన విజ్ఞప్తిని పట్టించుకోకుండా వీడియోను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

అంతేకాదు, ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాన్ని వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన గోప్యతను గౌరవించాలని, ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు.  సురేఖావాణి పేరుతో గతంలోనూ నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత విషయాలపై వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆమె పేరు వైరల్ కావడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.