దీపావళి రోజు ఈ 7 పక్షులను చూస్తే.. 2026లో మీకు తిరుగుండదు.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే..!

దీపావళి రోజు ఈ 7 పక్షులను చూస్తే.. 2026లో మీకు తిరుగుండదు.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే..!

దీపావళి పండుగ లక్ష్మీదేవి ఆశీస్సులు, సంపద, నూతన ఆరంభాలకు ప్రతీక. శకున శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కొన్ని రకాల పక్షులను చూడటం శుభశకునంగా పరిగణించబడుతుంది. దీపావళి రోజు 7 రకాల పక్షులను చూడటం ద్వారా రాబోయే 12 నెలల పాటు లక్ష్మీదేవి అనుగ్రహం, ధనలాభం, అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మరీ దీపావళి పర్వదినాన సంపద, శ్రేయస్సుకు సూచికలుగా భావించే ఆ 7 అదృష్ట పక్షులు ఏవో వివరాలు తెలుసుకుందాం.. 

1. గుడ్లగూబ:

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. దీపావళి రాత్రి గుడ్లగూబను చూడటం అత్యంత పవిత్రమైనది. ఇది వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు, సందనను సూచిస్తుందని నమ్మకం. వ్యాపారస్తులకు ఆదాయంలో మెరుగుదల, కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి ఒక శుభసూచకంగా భావిస్తారు.

2. నెమలి

అందం, వైభవానికి చిహ్నమైన నెమలిని పండుగ రోజున చూడటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు సంపద పెరుగుతుందని ఒక విశ్వాసం. అలాగే పదోన్నతులు, వృత్తిపరమైన గుర్తింపు లేదా ఒక ముఖ్యమైన పోటీ ఫలితం కోసం ఎదురుచూస్తున్న వారికి దీపావళి సమయంలో నెమలిని చూడటం ఒక శుభసూచకంగా భావిస్తారు. అలాగే, ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వారికి ఇది ఒక స్వాగత చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.

3. హంస

సరస్వతీ దేవితో సంబంధం ఉన్న హంస జ్ఞానానికి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి ప్రతీక. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, జ్ఞానంపై ఆధారపడి జీవించే వారికి దీనిని చూడటం శుభసూచకంగా భావిస్తారు. అంతేకాకుండా, విద్య, మేధోపరమైన అన్వేషణలు, ముఖ్యమైన వృత్తిపరమైన నిర్ణయాలలో పురోగతికి ఇది ఒక సూచనగా పరిగణించబడుతోంది.

4. పిచుక

దీపావళి రోజు మీ ఇంటి పెరట్లోకి, బాల్కనీలోకి లేదా కిటికీ వద్దకు పిచ్చుక రావడం ఒక శుభశకునంగా పరిగణించబడుతుంది. దాని వల్ల కుటుంబంలో శాంతి, కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, గృహ ఆర్థిక స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. ఒక జత పిచ్చుకలను చూడటం కూడా దంపతుల మధ్య సామరస్యానికి శుభసూచకంగా భావిస్తారు.

ALSO READ : మనం నష్టపోకుండా... తోటివారికి మంచి చేయడం అంటే ఇదే..!

5. రంగురంగుల చిలుక

చిలుకలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మోసుకొస్తాయని నమ్మకం. దీపావళి వేళ చిలుకను చూడటం శుభవార్తలను, సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రతిపాదన, ముఖ్యమైన సందేశం లేదా సంబంధంలో పురోగతి కోసం ఎదురుచూస్తున్న వారికి దీపావళి సమయంలో ఇది కనిపించడం ఒక శుభసూచకంగా భావిస్తారు. అలాగే, మెరుగైన సంభాషణ, సామాజిక పరిచయాల ద్వారా లభించే అవకాశాలతో కూడా దీనికి సంబంధం ఉంది.

6. పాలపిట్ట 

భారతీయ శకున సంప్రదాయాలలో పాలపిట్టకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దసరా రోజే కాకుండా దీపావళి సమయంలో కూడా పాలపిట్టను చూడటం విజయం మరియు శ్రేయస్సుకు సూచనగా భావిస్తారు. దీపావళి సమయంలో పాలపిట్టను చూడటం ద్వారా వ్యాపారం, న్యాయపరమైన విషయాలు లేదా వృత్తిపరమైన పనులలో జాప్యాన్ని ఎదుర్కొంటున్న వారికి ఇది ఒక ప్రోత్సాహకరమైన శకునంగా కూడా భావిస్తారు.

7. నవరంగ్ పక్షి

తొమ్మిది రంగుల కలబోతగా ఉండే ఈ పక్షిని చూడటం కొత్త ప్రారంభాలకు, కెరీర్ మార్పులకు, కొత్త ఆదాయ వనరులు లభించడానికి ప్రోత్సాహకరమైన సంకేతం.

పట్టణీకరణ, రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల నగరాల్లో ఈ పక్షులు కనుమరుగయ్యాయి. పట్టణాల్లో ఉండే వారు దీపావళి రోజున ఈ పక్షులను ప్రత్యక్షంగా చూడలేకపోతే పక్షుల ఫొటోలను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూస్తూ ధ్యానం చేయడం కూడా సంపదను ఆకర్షించే ఒక మార్గంగా జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.