చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే... ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!

చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే... ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!

చలికాలం వచ్చేసింది.ఎప్పటిలాగే వస్తూ వస్తూ జలుబు, దగ్గు లాంటి చిన్న వంటింటియితే, వెంట తీసుకొచ్చింది. అయితే, చిన్న చిన్న విషయాలకు డాక్టర్ దగ్గరికి వెళ్లడం కన్నా.. సింపుల్ గా వంటింటి చిట్కాలు పాటించడం బెటర్..

వంటింట్లో ఔషధాల్లో పసుపు ముందు వరుసలో ఉంటుంది... ఇమ్యూని టీ పెంచడంలో పసుపు సాయం చేస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించగానే ఉదయం, రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే రిలీఫ్ గా ఉంటుంది. కిందపడినప్పుడు దెబ్బతాకిన చోట పసుపు రాస్తే రక్తం కారడం ఆగిపోతుంది. చిన్న గాయాలకు పసుపు నుంచి ఔషధం

దాల్చిన చెక్క

వంటలకు రుచి, ఘుమఘుమలు తీసుకొచ్చే దాల్చిన చెక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్లకు చలికాలంలో ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.. నీరసం, నోటి దుర్వాసనలను దూరం చేస్తుంది. అలాగే రెగ్యులర్ గా  దాల్చినచెక్క తినడం వల్ల శరీరం చురుగ్గా ఉంటది.

ఎల్లిగడ్డ

చలికి రక్తనాళాలు మూసుకుపోతుంటాయి... ఇలా కాకుండా ఉండటానికి రోజూ ఎల్లిగడ్డను ఫుడ్ లో భాగం చేసుకోవాలి ఎల్లిగడ్డ తినడం వల్ల శరీరం వేడిగా మారుతుంది.

ఎండుమిర్చి

జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఇంట్లో ఎండుమిర్చి కారం పొడి చేసుకుంటారు. ఎండుమిర్చి కారం.. తినడం వల్ల ఘాటుకు ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం, ఊపిరితిత్తుల్లో నిండే సంజు బయటకుపోతుంది. 

యాలకలు

చలికాలంలో పొద్దున్నే లేపబుద్ధి కాదు.. ఏ పనీ చే యబుద్ధి కాదు. దీనికి యాలకులతో చెక్ పెట్టొచ్చు. గ్లాసడు నీళ్లలో రెండు మూడు యాలకలు వేసి వేడి చేయాలి. చల్లారాక దాంట్లో కొంచెం తేనె కలిపి రోజూ తాగితే ఫలితం కనిపిస్తుంది.

అల్లం- బెల్లం

కరోనా ప్రభావంతో అల్లం, శొంఠి వాడకం ట్రెండింగ్ లోకి వచ్చింది. చాయ్ లో వేసు కోవడం, వాటర్లో వేసుకొని వేడి చేసుకుని తాగడం పెరిగిపోయింది. అల్లం కరోనాకు మందు అవునో కాదు. తెలియదు కానీ, జలుబుకు మాత్రం అల్లం మంచి మెడిసిన్..! ఇక, అజీర్తి అనిపిస్తే బెల్లం ముక్క నోట్లో వేసుకొని చప్పరించాలి. 

గొంతు గర గరకు శోంఠి పొడి, బెల్లం కలిపి తింటే చక్కగా పని చేస్తుంది. 'కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ గిరాకీ పెరిగింది. డ్రైఫ్రూట్స్ తో పాటు శొంఠి, మిరియాలు, పసుపు, అల్లం ఎక్కువగా కౌంటున్నా రు. 

ఈ చలికాలంలో వీటికి గిరాకీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో జలుబు, దగ్గు రాకుండా జాగ్రత్త కోసం వీటిని ఎక్కువగా వాడుతున్నారు' అని కాటారంలో డ్రైఫ్రూట్స్ దుకాణం నడుపుతున్న సింహాచలం చెప్పాడు.

చలికాలం చిట్కాలు

చలికాలం స్టార్ట్ అయింది... కరోనాతో పాటు జలుబు, జ్వరాలు ఈ టైమ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లనవసరం లేదు... వీటిని ఇంట్లోనే కంట్రోల్ చేయొచ్చు. 

పోపు డబ్బాలో ఉండే ప్రతి దినుసు మెడిసినల్ వ్యాల్యూ ఉన్నదే..! అల్లం, శొంఠి వేసుకుని నీళ్లలో మరిగించి తాగాలి. పసుపుతో రోజూ రెండు మూడుసార్లు ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు నయమవుతాయి. ఈ సమస్య తీవ్రంగా ఉందనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.