ఆరు రోజుల్లో 50 వేల కోళ్లు మృతి.. కాళ్లు వెనక్కి.. రెక్కలను విప్పి చచ్చిపోతున్న కోళ్లు !

ఆరు రోజుల్లో 50 వేల కోళ్లు మృతి.. కాళ్లు వెనక్కి.. రెక్కలను విప్పి చచ్చిపోతున్న కోళ్లు !

చెన్నై: తమిళనాడులో కోళ్ల చావులు కలకలం రేపాయి. ఆరు రోజుల్లో దాదాపు 50 వేల కోళ్లు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో.. దీపావళికి ముందు తమిళనాడు ఫౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను చవిచూశారు. ల్యాబ్ పరీక్షలు బర్డ్ ఫ్లూ కాదని నిర్ధారించాయి. 

తమిళనాడులోని కడలూరు జిల్లాలో అంతుచిక్కని వ్యాధి బారిన పడి ఆరు రోజుల్లోనే పలు గ్రామాల్లో దాదాపు 50 వేల కోళ్లు చనిపోయాయి. ఈ వ్యాధి బారి నుంచి రైతులు తమ మిగిలిన కోళ్ళను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు.

కడలూరులో కోళ్ల పెంపకందారుడైన మోహన్ ఒక వారంలోనే సుమారు 7 వేల కోళ్లను కోల్పోయినట్లు సమాచారం. ఇతర ఫౌల్ట్రీ రైతులు కూడా విపరీతమైన నష్టాలను చవిచూశారు. దీంతో ఫౌల్ట్రీ పరిశ్రమను నమ్ముకున్న వారి జీవనోపాధికి, కోళ్ల పెంపక వ్యాపారాలకు పెను ముప్పు వాటిల్లింది. కాళ్లను వెనక్కి చాచి, రెక్కలను విప్పి పడుకుని ఉన్న స్థితిలో చనిపోయిన కోళ్లు కనిపించడంతో, ఈ అసాధారణ లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.