Chennai Super Kings: ఐపీఎల్ (IPL) 2027 మినీ ఆక్షన్ ముగింపు గడువు నవంబర్ 17వ తేదీ దగ్గరపడుతుండటంతో ఫ్రాంచైజీల్లో వాతావరణం వేడెక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రూట్ మార్చి లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను దక్కించుకుని.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను ఇచ్చేసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న మినీ ఆక్షన్‌కు ముందు CSK, కేకేఆర్ (KKR) జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి? ఎవరిని వదిలించుకోవాలి? అనే అంశంపై భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బిగ్ అనాలిసిస్ చేశాడు.
CSK మాస్టర్ ప్లాన్: రూ. 14.20 కోట్ల కుర్రాడిపై నమ్మకం:
గత ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై రూ. 14.20 కోట్లు పోసి కొనుగోలు చేసిన 20 ఏళ్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌కు పెద్దగా అవకాశాలు రాలేవు. అయినా అతన్ని వదులుకోవద్దని ఇర్ఫాన్ పఠాన్ సీఎస్‌కే యాజమాన్యానికి స్పష్టం చేశాడు. అతడు చాలా ఖరీదైన ఆటగాడే కావొచ్చు. కానీ ప్రశాంత్ లో ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక సీజన్ సరిగ్గా ఆడనంత మాత్రాన అతన్ని పక్కనపెట్టడం తప్పు.. సీఎస్‌కే ఖచ్చితంగా అతనికి మరో అవకాశం ఇచ్చి రిటైన్ చేసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
* కార్తీక్ శర్మ (రిటైన్డ్ ఖాయం): గతేడాది రూ. 14.20 కోట్లతోనే కొనుగోలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ సీజన్ చివర్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో అతన్ని రిటైన్ చేసుకోవడం పక్కా.
* రాహుల్ చాహర్‌కు టాటా బైబై: రూ. 5.2 కోట్లతో జట్టులోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు మాత్రం ఈసారి చెన్నై గుడ్‌బై చెప్పాలని పఠాన్ సూచించాడు.
KKR రూ. 43.20 కోట్ల జోడీపై ట్విస్ట్:
గత సీజన్ వేలంలో ఏకంగా రూ. 43.20 కోట్లు కుమ్మరించి కెమరాన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), మతీష పతిరణ (రూ. 18 కోట్లు)లను దక్కించుకుంది కేకేఆర్. అయితే 2027 సీజన్ ముందట వీరిద్దరి రిటెన్షన్ KKR కు పెద్ద తలనొప్పిగా మారింది.
