దీపావళి పండుగ ముందు రోజు భారీగా గంజాయిని సిటీలోకి సరఫరా చేసేందుకు బిగ్ ప్లాన్ చేశారు దుండగులు. 2026 నవంబర్ 7వ తేదీన ఎల్బీనగర్, పోచారం ఐటీ కారిడార్, మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి పెడలింగ్ రాకెట్ ఆట కట్టించారు. దాదాపు 30 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ అనురాధ మీడియాకు వెల్లడించారు. వాహన తనిఖీలో భాగంగా పట్టుబడిన నిందితులు మొహమ్మద్ అమెర్, ఇమ్రాన్ ఉద్దీన్ లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పక్కా సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మారుతి సుజీకి sx కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు.
నిందితులు ఒడిశాలో పూర్ణచందర్ దగ్గర గంజాయి రిసీవ్ చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఒడిశా నుంచి ముంబై గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులు ఒడిశాలో 7 వేల రూపాయలకు కిలో గంజాయి కొనుగోలు చేసి ముంబైలో 17వేలకు అమ్ముతున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై సప్లైపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు చెప్పారు. డ్రగ్స్, గంజాయి, పెడలింగ్ ట్రాన్స్ పో ర్ట్ లో పాల్గొంటే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న పర్ణచందర్, యస్మిన్ చాంద్ సయ్యద్ లను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఈ కేసులో 30 లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
