Alias Rukmini : పదేళ్లు వెనక్కి వెళ్లిన నితిన్.. 'అలియాస్ రుక్మిణి' నుంచి సర్‌ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్!

Alias Rukmini : పదేళ్లు వెనక్కి వెళ్లిన నితిన్.. 'అలియాస్ రుక్మిణి' నుంచి సర్‌ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్!

వరుస ప్లాప్స్ తో తీవ్ర నిరాశలో ఉన్న హీరో నితిన్ ఈ సారైనా గట్టి హీట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి యాక్షన్, మాస్ ఎలివేషన్లకు భిన్నంగా ఓ అందమైన ప్రేమకథతో అలరించబోతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న 'అలియాస్ రుక్మిణి' సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో ఆ ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ చిత్రంలో నితిన్ కృష్ణ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన నితిన్‌కు, ఈ సినిమాలో కనిపించబోయే నితిన్‌కు చాలా తేడా ఉండబోతోందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. రుక్మిణి తన జీవితంలోకి రాకముందు కృష్ణ ఎలా ఉండేవాడు? అతడి ప్రపంచం ఎలా సాగేది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ గ్లింప్స్ పరిచయం చేస్తోంది.

మస్టర్డ్ ఎల్లో టీషర్ట్, చక్కగా స్టైల్ చేసిన హెయిర్, పలుచటి మీసంతో నితిన్ లుక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. దాదాపు పదేళ్లు వెనక్కి వెళ్లినట్టుగా కనిపిస్తున్న ఆయన బాడీ లాంగ్వేజ్, అమాయకమైన ఎక్స్‌ప్రెషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓ డెస్క్ ముందు పెన్ను పట్టుకుని ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన కృష్ణను చూస్తుంటే.. ప్రేమలో పడకముందు తనకంటూ ఓ అందమైన ప్రపంచంలో విహరించే యువకుడిలా అనిపిస్తున్నాడు. నితిన్ కొత్త అవతారాన్ని చూసి రుక్మిణి పాత్రలోని ఆఫియా సయ్యద్ ఆశ్చర్యపోయింది.

ఈ సినిమాలో నితిన్, ఆఫియా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది.  మరోవైపు, గతంలో 'దండోరా'తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీత బాధ్యతలు చేపట్టారు. సాయికుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఇప్పటికే విడుదలైన ‘రుకు రుకు రుక్మిణి’ పాట సినిమాపై మ్యూజికల్ బజ్‌ను పెంచింది. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించారు.