కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది ( 2026 ) వరుస విజయాలతో ఫుల్ జోరులో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం 'సీన్' నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తొలిసారి తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు, తొలి రోజే భారీ వసూళ్లు నమోదయ్యాయి.
సూర్య, నజ్రియా నజీమ్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. విడుదలైన మొదటి రోజే ఇండియాలో రూ.19.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళ వెర్షన్ ద్వారా రూ.16.15 కోట్లు రాగా, తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూ.3 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లోనూ రూ.12 కోట్ల వసూళ్లు సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు గ్రాస్ కలెక్షన్లు రూ.34.25 కోట్లకు చేరాయి.
ఈ ఏడాది సూర్య నటించిన గత చిత్రాల ఓపెనింగ్స్‌ను 'సీన్'సులభంగా అధిగమించింది. మేలో విడుదలైన ఆర్జే బాలాజీ దర్శకత్వంలోని 'కరుప్పు' తొలి రోజు రూ.15.50 కోట్లు వసూలు చేయగా.. ఆగస్టులో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ.15.35 కోట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టి సూర్య కెరీర్లోనే కాకుండా 2026లోనూ భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో 'సీన్' నిలిచింది. అయితే ఈ ఏడాది విడుదలైన రజనీకాంత్ ‘జైలర్ 2’ రూ.59.70 కోట్లు, విజయ్ ‘జన నాయగన్’ రూ.42.70 కోట్ల ఓపెనింగ్స్‌తో ఇంకా టాప్ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
తొలి రోజు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా 6,167 షోలు ప్రదర్శించగా, సగటు ఆక్యుపెన్సీ 55 శాతంగా నమోదైంది. తమిళనాడుతో పాటు కేరళలోనూ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇక 'కరుప్పు'తన పూర్తి రన్లో రూ.310.12 కోట్లు,'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ.209.46 కోట్లు వసూలు చేశాయి. మరి 'సీన్' ఈ రెండు సినిమాల రికార్డులను కూడా అధిగమిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ALSO READ : రణ్‌బీర్ 'రామాయణ ' బాక్సాఫీస్ విధ్వంసం..
2డీ ఎంటర్టైన్మెంట్స్, ఝగరం స్టూడియోస్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. లాల్, ఆనందరాజ్, గజరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మొత్తానికి దీపావళి బరిలో సూర్య సృష్టించిన ఈ'సీన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..
