పరాగ్వే అధ్యక్షుడిని తొలగించి అరెస్ట్ చేశారు : గంటల్లోనే మారిపోయిన ఆ దేశం ముఖచిత్రం

పరాగ్వే అధ్యక్షుడిని తొలగించి అరెస్ట్ చేశారు  : గంటల్లోనే మారిపోయిన ఆ దేశం ముఖచిత్రం

బ్యాంకింగ్​ కుంభకోణం ఆరోపణలతో పరాగ్వే దేశ అధ్యక్షుడిపై అభిశంసనతో పదవినుంచి తొలగించారు.  అనంతరం అవినీతి ఆరోపణలతో శాంటియోగో ను అరెస్ట్ చేశారు.  పరాగ్వేలో ప్రముఖ డిజిటల్ బ్యాంకు అయిన  యుయెనో బ్యాంక్ (Ueno Bank) తీవ్రఆర్థిక సంక్షోభంలో పడి దివాలా తీసింది. దాంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ దానిని అధీనంలోకి తీసుకుని ఖాతాలను స్తంభింపజేసింది. దీంతో పరాగ్వే జనాభాలో దాదాపు సగం మంది తమ పొదుపు సొమ్మును, పెన్షన్లను విత్‌డ్రా చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

శాంటియాగో పెనాకు ఈ బ్యాంకును నియంత్రించే మాతృసంస్థ అయిన 'గ్రూపో వాజ్క్వెజ్'లో గతంలో షేర్లు ఉన్నాయి. తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి వందల మిలియన్ల డాలర్ల ప్రభుత్వ నిధులను, ప్రభుత్వ పెన్షన్ నిధులను చట్టపరమైన పరిమితులకు మించి ఈ బ్యాంకులో డిపాజిట్ చేయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
 
దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో, నైతిక బాధ్యత వహిస్తూ పెనా నవంబర్ 5న (గురువారం) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదిస్తే మాజీ అధ్యక్షుడిగా ఆయనకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని భావించిన అక్కడి చట్టసభ సభ్యులు ఆయన రాజీనామాను తిరస్కరించారు. ఆ మరుసటి రోజే (నవంబర్ 6, శుక్రవారం) సెనేట్ ఏకగ్రీవంగా  44-0-0 ఓట్లతో ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, పదవి నుంచి తొలగించింది.

ALSO READ : రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. 

అరెస్టు,విచారణ..

అభిశంసనతో ఆయనకున్న చట్టపరమైన రక్షణలు రద్దు కావడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశాల మేరకు పెనాను అరెస్ట్ చేశారు. అసున్సియోన్‌లోని ఆయన నివాసంలో గృహనిర్బంధంలో ఉంచారు. నమ్మకద్రోహం, అధికార దుర్వినియోగం, అవినీతి ,మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలపై శాంటియోగో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.శాంటియాగో పెనా పదవి నుంచి తొలగించబడటంతో పరాగ్వే వైస్ ప్రెసిడెంట్ పెడ్రో అలియానా (Pedro Alliana) నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.