చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ అసైన్‌మెంట్లు, ఎగ్జామ్స్, ఉద్యోగాల కోసం పరుగులు పెడుతుండగా... 21 ఏళ్ల అనన్యా అగర్వాల్ మాత్రం వేరే మార్గం ఎంచుకుంది. చదువు పూర్తయ్యాక బిజినెస్ లేదా ఎంటర్ప్రెన్యూవర్ గా మారే సంప్రదాయం కాదని.. చదువుతూనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తన కలల కెఫే స్టార్ట్ చేసి 50 రోజుల్లోనే 15 లక్షల రూపాయలు సంపాదించి అందరినీ ఆకర్శించింది. ఉద్యోగాలు, టార్గెట్స్, లేఫాఫ్స్ భయాలతో యువత గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో అనన్య సాధించి చూపించిన సక్సెస్ మంత్ర ఏంటో చూద్దాం.
అనన్య గురుగ్రామ్‌లో ల్యూమ్ & లైమ్ (Lume & Lime) అనే వెజిటేరియన్ కేఫ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుతోపాటు రెస్టారెంట్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ విశాల్ అగర్వాల్, ప్రీతి అగర్వాల్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని స్థాపించింది. తండ్రి దశాబ్దాల వ్యాపార అనుభవం ఆమెకు కలిసొచ్చింది.
ఎందుకు ఈ కేఫ్?
రెస్టారెంట్ ప్రారంభించడం పెద్ద విషయం కాదు. పెట్టుబడి ఉంటే.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే సింపుల్ గా పెట్టేయొచ్చు. కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి.. కాకలు తీరిన వ్యాపారులకు కూడా సాధ్యం కాని సక్సెస్ ను అందుకోవడమే స్పెషల్. ఇండియాలో రెగ్యులర్ గా ఉండే రష్, గందరగోళం మధ్య ఉన్నట్లుగా కాకుండా.. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఆహారం ఆస్వాదించే స్థలం కావాలని భావించింది. ఆమె ప్రత్యేకంగా ఇటాలియన్, మెక్సికన్, మెడిటరేనియన్ వంటకాలను ఒరిజినల్ ఫ్లేవర్ తగ్గకుండా అందించడంతో సక్సెస్ అందుకున్నారు.
జనరల్ గా ఇండియాలో ఇటాలియన్, మెడిటరేనియన్ లేదా మెక్సికన్ వంటకాలకు చాలా స్పైసెస్ వేసి ఇండియనైజ్ చేస్తారు. అంటే విదేశీ వంటకాలకు విదేశీ ఫ్లేవర్ అంటించి ఇవ్వడం మనవాళ్లకు అలవాటు. దీంతో చాలా మంది ఏవి తిన్నా.. ఇవి ఆల్ రెడీ తిన్నవే కదా అనే ఫీలింగ్ లో అంటుంటారు. అందుకే ఒరిజినాలిటీ మిస్ కాకుండా ఇవ్వడమే ఆమె సక్సెస్ కు కారణం.
మెనూ వివరాలు
ల్యూమ్ & లైమ్ పూర్తిగా వెజిటేరియన్ బిస్ట్రో. ఇక్కడ బ్రిక్-ఓవెన్ పిజ్జాలు, హ్యాండ్‌మేడ్ పాస్తాలు, టాకోస్, మెజ్జే ప్లాటర్లు, స్పెషాలిటీ బ్రెడ్‌లు, వివిధ రకాల ఫ్రైస్, స్పెషాలిటీ కాఫీ, బెవరేజెస్, డెజర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వేగన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కేఫ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుంది.
అనన్య చదువు, వ్యాపారం రెండింటినీ బాలన్స్ చేస్తూ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నాకు చాలా ముఖ్యం అని చెప్తోంది. యువత తమ విద్యతోపాటు వ్యాపార ఆలోచనలను ఎలా అమలు చేస్తున్నారో అనన్యా కథ ఒక ఉదాహరణ. 50 రోజుల్లోనే రూ.15 లక్షలు సంపాదించిన ఎంటర్ ప్రెన్యూవర్ కాలేజీ లైఫ్ ను అందరు విద్యార్థుల్లా కాకుండా కొత్త వేలో మలచుకుని సక్సెస్ అయ్యింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
