రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. రెండు నెలల తర్వాత స్వగ్రామానికి మృతదేహం

రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. రెండు నెలల తర్వాత స్వగ్రామానికి మృతదేహం

బతుకుదెరువుకని వెళ్లి రెండు దేశాల మధ్య ఆధిపత్యపోరులో తనువు చాలించిన జగిత్యాల వాసి మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామం చేరింది. 2026 నవంబర్ 7న స్వగ్రామం హుస్నాబాద్ కు తరలించారు అధికారులు.

హస్నాబాద్ కు చెందిన సుదర్శన్ అనే కార్మికుడు రెండు నెలల క్రితం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి మృతదేహం అక్కడే ఉండిపోయింది. సుదర్శన్ మృతితో ఆయన మృతదేహం కోసం కుటుంబ సభ్యులు కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తమ బడ్డ చనిపోయాడనే నిజాన్ని తట్టుకోలేక గుండెపగిలిన కుటుంబ సభ్యులకు.. ఆయన మృతదేహం అనాధలా అక్కడే రెండునెళ్లుగా పడి ఉండటాన్ని తట్టుకోలేకపోయారు. 

ALSO READ : వరంగల్ జిల్లాలో విషాదం.. భార్యా పిల్లల ఉసురు తీసిన భర్త పర స్త్రీ వ్యామోహం

అతని మృతదేహాన్ని తెప్పించాలని కుటుంబ సభ్యులు చెప్పులు అరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు అందించారు. ఎట్టకేలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్వదేశానికి మృతదేహం వచ్చింది. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు అంతిమయాత్రలో పాల్గొన్నారు.  మృతుడి అంత్యక్రియల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబానికి అంతా తానై నిలిచిన వ్యక్తి చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సుదర్శన్ కు 
కన్నీటి వీడ్కోలు పలికారు.