వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాఖాల చెరువులో దూకి వివాహిత ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాధితులను గీసుకొండ మండలం ఎల్కతుర్తి హవేలీ గ్రామానికి చెందిన మమత (30 ), ఆమె ఇద్దరు కూతుర్లు హరిణి ,జున్నుగా పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాలతో మమత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 6 సంవత్సరాల క్రితం సుమన్‌ను మమత ప్రేమ వివాహం చేసుకుంది. సుమన్ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంలో భార్యాభర్త మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో మమత తీవ్ర మనస్తాపంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఇవ్వాళ(నవంబర్ 7, 2026) పాఖాల చెరువులో పిల్లలను తోసేసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న డీసీపీ అంకిత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
