వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు: ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్‌గా ఇచ్చిన విశాల్ గోండాల్

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు: ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్‌గా ఇచ్చిన విశాల్ గోండాల్

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఈసారి దీపావళి వేడుకలు వైభవంగా, ప్రత్యేక ఆకర్షణలతో జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌ ఓవల్ ఆఫీస్‌లో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, ప్రవాస భారతీయులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపాల కాంతుల నడుమ సాగిన ఈ సంబరాలు అమెరికా రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి.

ఈ దీపావళి వేడుకల్లో అత్యంత ప్రధాన హైలైట్‌గా నిలిచిన సంఘటన ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకర్షించింది. ప్రముఖ ఫిట్‌నెస్ టెక్నాలజీ సంస్థ 'GOQii' వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గోండాల్ ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌నకు హిందువుల అత్యంత పవిత్రమైన గ్రంథం 'హనుమాన్ చాలీసా'ను కానుకగా అందజేశారు. ప్రపంచ అత్యున్నత పదవిలో ఉన్న ఒక అగ్రరాజ్య అధినేత చేతికి హనుమాన్ చాలీసా పుస్తకం అందడం, దాని విశిష్టతను ఆయనకు తెలియజేయడం భారతీయులందరికీ ఎంతో గర్వకారణంగా నిలిచింది. 

ALSO READ : ఏనుగు పిల్లను కాపాడిన అనంత్ అంబానీ.. వంతార ఆసుపత్రికి మాయ ఎయిర్‌లిఫ్ట్

భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన హనుమాన్ చాలీసాను ట్రంప్ స్వీకరించడం 2 దేశాల మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక బంధాలను మరింత గట్టిగా చాటిచెప్పింది. దీపావళికి వైట్‌హౌస్ వేదికగా భారతీయ సంప్రదాయాలకు దక్కిన ఈ అరుదైన గౌరవం ప్రవాస భారతీయుల్లో.. ఇండియన్-అమెరికన్ వర్గాలలో నూతనోత్సాహాన్ని నింపింది.