దీపావళి రోజు ప్రమాదాలు జరిగితే ఈ నెంబర్కు డయల్ చేయండి

దీపావళి రోజు ప్రమాదాలు జరిగితే ఈ నెంబర్కు డయల్ చేయండి


చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి రోజు అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అందుకే పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ( TGICCC )సూచించింది. దీపావళి వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలని కోరింది. 
 
విద్యుత్ అలంకరణల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. అగ్ని ప్రమాదాలు, గాయాలు, పేలుళ్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లపై అప్రమత్తంగా ఉండాలని  2026 నవంబర్ 7న ప్రెస్ నోట్ విడుదల చేసింది. 

అగ్ని ప్రమాదం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 112 చేయాలని విజ్ఞప్తి చేసింది. 24 గంటల పాటు అందుబాటులో తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీస్, ఫైర్, వైద్య సేవల సమన్వయంతో అత్యవసర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు.

సకాలంలో 112కు కాల్ చేస్తే ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చునని TGICCC పేర్కొంది. ఈ సందర్భంగా TGICCC అధికారులు ప్రజలందరికీ సురక్షితమైన, సంతోషకరమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.