అదో ఐటీ కంపెనీ. చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఓ టీం ఉంది.. ఆ టీంకి ఓ మేనేజర్ ఉన్నారు. కొన్నేళ్లుగా అంతా బాగానే నడుస్తుంది.. ఆ టీం సభ్యులతో మేనేజర్ కలిసిపోయాడు. అందరూ అన్నా అన్నా అని పిలవటం మొదలుపెట్టారు.. పిల్లలు.. చిన్న ఉద్యోగులు అని ఆ మేనేజర్ సైతం.. అన్నా అంటుంటే ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు. కంపెనీ యాజమాన్యం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నది. నీ టీం నుంచి 12 మంది ఉద్యోగులను తీసేయ్ అని.. అంతే ఆ మేనేజర్ షాక్.. అందరూ అన్నా అన్నా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు.. అలాంటోళ్లను నేనే ఎలా తీసేయగలను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇదెక్కడో కాదు.. చెన్నై సిటీలోని ఓ ఐటీ కంపెనీ మేనేజర్ సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగమైన సమాచారానికి.. సోషల్ మీడియా హోరెత్తింది. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి రెడ్డిట్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. దాదాపు 10 ఏళ్లుగా తనతో కలిసి పనిచేస్తున్న 12 మంది ఉద్యోగులను శుక్రవారం (2026 నవంబర్ 06) లోపు తొలగించమని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వారు కేవలం సహోద్యోగులు కాదని, కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీ మేనేజ్మెంట్ మేనేజర్ ను క్యాబిన్ లోకి పిలిచి.. 12 మంది పేర్లు ఉన్న ఎక్సెల్ షీట్‌ను ఇచ్చి, ప్రతి ఒక్కరితో 15 నిమిషాలు మాట్లాడి.. తొలగించాలని ఆదేశించారు. ఈ 12 మంది నాకు సాధారణ ఉద్యోగులు కాదు. 2016 నుంచి కలిసి పనిచేస్తున్నాం. పది సంవత్సరాలు పూర్తయ్యాయి అని ఆయన పోస్ట్‌లో రాశారు.
ALSO READ : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో వర్క్ ఫ్రమ్ పార్క్
‘అన్నా’ అని పిలిచే టీమ్
తన టీమ్ రాత్రులు ఆలస్యంగా ఉండి ప్రొడక్షన్ సమస్యలు పరిష్కరించుకునేది, కలిసి భోజనం చేసేది, పెళ్లిళ్లకు వెళ్లేది, వ్యక్తిగత సక్సెస్ ను జరుపుకునేది. ఉద్యోగులు ఆయనను తమిళంలో ‘అన్నా’ అని పిలిచేవారు. కొందరు ఉద్యోగులు తీవ్రమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక డెవలపర్ ఇటీవలే ఇంటి లోన్లు పూర్తి చేశాడు. మరొకరి తల్లి క్యాన్సర్‌తో ఆసుపత్రిలో ఉన్నారు. కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఆమెను కాపాడుతోంది. మరొక ఉద్యోగి భార్యకు వచ్చే నెలలో ప్రసవం ఉందని పేర్కొన్నారు.
రాజీనామా ఆలోచన..
మేనేజ్మెంట్ మధ్యస్థాయి మేనేజర్లపై భారం వేసి, కాస్ట్ కటింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని అమలు చేసేందుకు తమ లాంటి మేనేజర్లపైన భారం వేస్తారు. ఇది మేనేజ్మెంట్ కు కరెక్టు కాదని సీనియర్ నాయకత్వాన్ని ఆయన విమర్శించారు. తాను రాజీనామా చేస్తే బాగుంటుందని ఆలోచించినట్లు రాశారు. మీరు రైజన్ చేస్తే మరొకరిని మీ పోస్టులో పెడతారు.. అలాగని ఆ 12 మందిని తొలగించకుండా ఉండరు కదా.. అని అని గుర్తు చేశినట్లు పంచుకున్నారు.
వాళ్లకు ఈ విషయం తెలియదు. రేపు ఉదయం వాళ్లు నన్ను చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అన్నా అంటారు. నా కుటుంబం గురించి అడుగుతారు, పిల్లల గురించి అడుగారు. అలాంటి వాళ్లకు లేఆఫ్స్ గురించి ఎలా చెప్పాలి.. ఈ ఎమోషనల్ పెయిన్ ఎంత జీతం వచ్చినా.. తనకు ఏ టైటిల్ ఇచ్చినా కడిగివేయలేనని పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో ఎందరినో కదిలించి వేసింది. మేనేజర్ కు మద్ధతుగా కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఉద్యోగులపై సానుభూతి ఉన్నా.. నిర్ణయం మీ చేతుల్లో లేదు. మేనేజ్మెంట్ చెప్పింది చేయాల్సిందే కదా. కనీసం మీ కింది స్థాయి ఉద్యోగులపై అంత కన్సర్న్ ఉన్నందుకు మీ లాంటి వాళ్లు అవసరం అంటూ రిప్లై ఇస్తున్నారు.
