దీపావళి పండుగతో ఈ వారం ప్రారంభమవుతుంది. పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసం కూడా మొదలవుతుంది. గ్రహాల సంచారం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేషరాశి: ఈవారం ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు,స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం నెరవేరవేరే అవకాశం ఉంది.వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. , ఆర్థికంగా అభివృద్ది ఉంటుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, గృహం కొంటారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారు ఈ వారంలో గ్రహాలు బాగా అనుకూలించడం వలన చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అనవసర ఖర్చులు తగ్గుతాయి.స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు ఊహించని రీతిలో లాభాలు అందుకొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆశించిన మార్పులు కలుగుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసివస్తాయి
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. నూతనోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులు కొత్త విధుల్లో చేరతారు.
కర్కాటకరాశి: ఈ రాశి వారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ధైర్యంతో ముందుచూపు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పాతబాకీలు వసూలవుతాయి.ఉద్యోగస్తులు ఈ వారం చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్లు వస్తాయి.వ్యాపారస్తులకు లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.
సింహరాశి: ఈ వారంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు లాభం లేక పోయినా నష్టం ఉండదు. కొంతవరకు అప్పులు తీర్చే అవకాశం ఉంది.ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త పెట్టుబడుల విఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు
కన్యారాశి: ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు.కొత్త పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారలావాదేవీలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా అనూహ్యమైన లాభాలను అందుకుంటారు. కొన్ని మొండి బాకీలు వసూలవెతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు
తులారాశి: ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చాలా ప్రశాంతంగా గడుస్తుంది. పని ఒత్తిడి తగ్గి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు అద్భుతంగా సాగడంతో అనూహ్యమైన లాభాలను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి చేతికి వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఈ వారి కొత్త ప్రయత్నాలు ఫలించి పనులు వేగవంతం అవుతాయి. పనిలో అద్భుతమైన పురోగతి సాధించే అవకాశం ఉంది.ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అదనంగా కీలకమైన బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది.. వ్యాపారస్తులకు ఈ వారం పట్టిందల్లా బంగారమే అవుతుంది. మంచి ఆర్థిక లాభాలను సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. కొంతమంది తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి: ఈ రాశి వారి ఈ వారం గ్రహాలు బాగా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆశించిన ఆదాయం లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖ వ్యక్తులు మీకు కొంత సాయపడతారు. కుటుంబసభ్యుల ఆశలు నెరవేరుస్తారు. వ్యాపారులు మరింతగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు... వారాంతంలో వృథా ఖర్చులు ఉండే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ప్రతి పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రాబడి కొంత తగ్గినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. కొత్త కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో మనసులోని భావాలు పంచుకుంటారు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి.
కుంభరాశి: ఈ రాశి ఈ వారం ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకుప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సవ్యంగా సాగిపోయే అవకాశం ఉంది. ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆకస్మికంగా ధనప్రాప్తి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీనరాశి: ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కొంతమంది మాటలు విని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొత్త ప్రయత్నాలకు ఆటంకాలు కలిగాయని ఎట్టి పరిస్థితిలో విరమించుకోవద్దు.వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభావాలకు లొంగవద్దని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
