పఠాన్ చేరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలోని చిన్నకంజర్ల గ్రామంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం ( నవంబర్ 8 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే పేదల సంక్షేమ పథకాలు ప్రారంభమ్యాయ్యని అన్నారు. ఇందిరమ్మ వల్లే దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు చెప్పి మోసం చేశారని అన్నారు. కేసీఆర్ 8లక్షల కోట్ల అప్పు చేసాడని.. గతంలో బిల్లులు పెండింగు పెట్టాడు కాని మంచి పనులు చేయలేదని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పేదలందరికి ఇండ్లు ఇవ్వాలని కంకణం కట్టుకున్నారుని.. ప్రపంచంలోనే ఎక్కడా 2 లక్షల ఇండ్లు కట్ట లేదని.. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కట్టిందని అన్నారు. మరో 2 లక్షల ఇండ్లు సాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని..అర్హులకు పెన్షన్ లు, సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని.. బీద ప్రజలకు అండగా ఉంటున్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలలో స్కూల్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పథకం తెచ్చారని.. మంచి ఆరోగ్య కరమైన పౌష్టికాహారం ప్రభుత్వం పాఠశాలల పిల్లలకు పంపిస్తున్నామని అన్నారు మంత్రి వివేక్. దేశంలో ఎక్కడా ఇట్లా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లేదని అన్నారు.
బీద విద్యార్థులు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. రాజీవ్ ఆరోగ్య స్కీమ్ ద్వారా పది లక్షల వరకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. పటాన్ చెరు లాంటి ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు కావాలంటే.. ఏ టి సి సెంటర్ ల ద్వారా శిక్షణ ఇస్తున్నామని అన్నారు మంత్రి వివేక్.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉందని.. సిఎం పుట్టిన రోజు సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి జరుపుకోవడం సంతోషం గా ఉందని.. లబ్ది దారుల ఇంట్లో భోజనం చేయండి సంతోషం గా ఉందని అన్నారు మంత్రి వివేక్.
