కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. పుణ్య తిథులు, పండుగల వివరాలు మీకోసం..!

కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. పుణ్య తిథులు, పండుగల వివరాలు మీకోసం..!

పరమేశ్వరుడికి ఇష్టమైన కార్తీకమాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ నెలలో  ఇటు శివుడిని.. అటు విష్ణుమూర్తిని పూజిప్తారు.  ఈ ఏడాది( 2026)  నవంబర్​ 10 వ తేదీ న ప్రారంభమైన కార్తీకమాసం డిసెంబర్​ 8 వ తేదీన ముగుస్తుంది.  మరి ఈ నెల రోజుల పాటు పుణ్య తిథులు.. పండుగల వివరాల గురించి తెలుసుకుందాం. .  .!

కార్తీకమాసంలో శివారాధన చేయడం చాలా మంచిదని పురాణాల ద్వారా తెలుస్తుంది. దీపావళి తరువాత ప్రారంభమయ్యే కార్తీకంలో ఉపవాస దీక్షలు, వ్రతాలు చేయడంతో పాటు శైవక్షేత్రాలు సందర్శిస్తారు. అత్యంత భక్తితో పూజలు చేస్తారు. మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు

కార్తీకమాసం పుణ్యతిథులు.. పండుగల వివరాలు

  • నవంబరు 10: కార్తీకమాసం ప్రారంభం, ఆశాశదీపం 
  • నవంబర్ 11: భగిని హస్తి భోజనం, భాయ్ దూజ్
  • నవంబర్ 13: నాగుల చవితి, తిరుమలలో పెద్ద శేష వాహన సేవ
  • నవంబర్​ 14: బాలల దినోత్సవం
  • నవంబర్ 15:  స్కంద షష్ఠి, తిరుమలలో పుష్పయాగానికి అంకురార్పణ
  • నవంబర్ 16: కార్తీక సోమవారం, కోటి సోమవారం  వృశ్చిక సంక్రాంతి
  • నవంబర్​ 19: యాజ్ఞవల్క జయంతి, చాతుర్మాస వ్రతం ముగింపు,తిరుమలలో శ్రీ ఉగ్ర శ్రీనివాసుని ఊరేగింపు
  •  నవంబర్ 20:  దేవుత్థాన ఏకాదశి, కార్తీక ఏకాదశి
  •  నవంబర్ 21:  తులసి వివాహం, క్షీరాబ్ధి ద్వాదశి
  •  నవంబర్ 22: ప్రదోష వ్రతం
  • నవంబరు 23: కార్తీకమాసం  రెండో కార్తీక సోమవారం
  •  నవంబర్ 24: కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి, గురునానక్ జయంతి, జ్వాలా జయంతి, కేదారీశ్వర వ్రతం
  • నవంబర్ 27:  సంకష్టహర చతుర్థి 
  • నవంబరు 30 : కార్తీకమాసం  మూడో కార్తీక సోమవారం
  • డిసెంబర్​ 4: సర్వ ఏకాదశి
  • డిసెంబర్ 6:  పక్ష ప్రదోషం
  • డిసెంబర్ 7: కార్తీక మానం నాలుగో సోమవారం,మాస శివరాత్రి
  • డిసెంబర్ 8:కార్తీకమాసం ముగింపు