గురుకుల బెడ్‌‌‌‌షీట్లలో రూ.100 కోట్ల స్కామ్‌‌‌‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆరోపణ

గురుకుల బెడ్‌‌‌‌షీట్లలో రూ.100 కోట్ల స్కామ్‌‌‌‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆరోపణ
  • గురుకులాల టెండర్లను గుజరాత్​ కంపెనీకి కట్టబెట్టారని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో చదువుకునే పేద విద్యార్థుల బెడ్‌‌‌‌షీట్లలోనూ రూ.100 కోట్ల భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌‌‌‌ ఆరోపించారు. గురుకులాల టెండర్లను సెంట్రలైజ్ చేసి, పాత బట్టలను రీసైకిల్ చేసే గుజరాత్‌‌‌‌కు చెందిన ‘మఫత్‌‌‌‌లాల్‌‌‌‌’ కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. కుక్క పేగుల్లాంటి ఆ నాసిరకం దుప్పట్లను రేవంత్‌‌‌‌రెడ్డి తన మనవడికి కప్పుతారా..? అని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కూడా దోపిడీకి అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు కనీసం కాటన్ బెడ్‌‌‌‌షీట్లు ఇచ్చే దిక్కులేదు గానీ.. పాలకులకు మాత్రం ఇంద్ర భవనాలు కావాలా..? అని నిలదీశారు. గురుకులాలకు అవసరమైన దుప్పట్లలో టెస్కో ద్వారా స్థానిక చేనేత కార్మికులకు 3.5 లక్షల ఆర్డర్ ఇచ్చి, మరో 3.5 లక్షల ఆర్డర్‌‌‌‌ను గుజరాత్ కంపెనీకి అప్పగించారన్నారు.