- డిసెంబర్ 31 నుంచి వీఆర్ఎస్ పొందడానికి అనుమతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పి.రవిశంకర్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వ్యక్తిగత కారణాల వల్ల విధులను విరమించుకుంటానని ఆయన పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం పరిశీలించి అనుమతులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం 2026 డిసెంబర్ 31 నుంచి ఆయన వీఆర్ఎస్ తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అయితే.. ఒకవేళ ఆయనపై భవిష్యత్‌లో ఏవైనా శాఖాపరమైన లేదా క్రిమినల్ కేసులు నమోదైనా, ప్రభుత్వ బకాయిలు ఏవైనా వసూలు చేయాల్సి ఉన్నా.. ఈ పదవీ విరమణ ఉత్తర్వులు వాటికి వర్తించవని స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్ అధికారిక జీవో జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌ను రాబోయే తెలంగాణ అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా ప్రింటింగ్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్-ఇన్-చీఫ్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
