రోహిత్ శర్మ కెప్టెన్సీపై బిగ్ అప్‌డేట్.. అనౌన్స్మెంట్కు డేట్ ఫిక్స్?

రోహిత్ శర్మ కెప్టెన్సీపై బిగ్ అప్‌డేట్.. అనౌన్స్మెంట్కు డేట్ ఫిక్స్?

Rohit Sharma: ఐపీఎల్ 2027 రిటెన్షన్ డెడ్‌లైన్ (నవంబర్ 17) దగ్గరపడుతున్న వేళ ట్రేడింగ్ మార్కెట్‌లో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) యాజమాన్యం తమ జట్టు పగ్గాలను మళ్లీ లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మకే అప్పగించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నవంబర్ 16 నుంచి 18 మధ్య ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

హార్దిక్ పాండ్యా ట్రేడ్: 

* గత మూడు సీజన్లుగా (2024–2026) ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా రాబోయే IPL 2027 కోసం పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టులోకి మారనున్నాడు.

* భారీ ట్రేడ్ ప్లాన్: పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌లోకి రానుండగా, హార్దిక్ పాండ్యా పంజాబ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఇరు ఫ్రాంచైజీలు ఇప్పటికే బీసీసీఐ (BCCI) కి అవసరమైన పత్రాలను సమర్పించాయని తెలుస్తుంది. 

* పాండ్యా కెప్టెన్ కాడు: పంజాబ్ కింగ్స్ జట్టుకు హార్దిక్ వెళ్లినప్పటికీ అతను కెప్టెన్‌గా ఉండడు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ సారథిగా కొనసాగుతాడు.

హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్: 

2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించి ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ఘనత రోహిత్ సొంతం. 2024లో పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత, జట్టు రీ-స్ట్రక్చరింగ్‌లో భాగంగా రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా ప్రకటించనుండటం మైండ్ బ్లాకింగ్ న్యూస్‌గా మారింది.

మిగతా ఫ్రాంచైజీల అప్‌డేట్స్:

* రాజస్థాన్ రాయల్స్ (RR): రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ తొలగింపు గురించిన పుకార్లకు చెక్ పడింది. అతను కెప్టెన్‌గానే కొనసాగనున్నాడు.

* పంజాబ్ కింగ్స్ (PBKS): శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా రూపంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్ లభించనున్నాడు.