వోల్టాస్ కొత్త ఛైర్మన్ సునీల్ డిసౌజా టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్‌లో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. నోయల్ టాటా పదవీ విరమణ నేపథ్యంలో ఆయనకు ఛైర్మన్ ఎమెరిటస్ హోదా కల్పించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. నవంబర్ 12 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ, సీఈఓ సునీల్ డిసౌజా వోల్టాస్ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
నోయల్ టాటాకు 2003 నుంచి వోల్టాస్‌తో అనుబంధం ఉంది. కంపెనీ ఎండీ ముకుందన్ మీనన్ పదవీకాలం ఈ ఏడాది మే 24తో ముగియనుంది. ఆయన స్థానంలో రూమ్ ఏసీ విభాగాధిపతి జయంత్ బాలన్‌ను ఐదేళ్లపాటు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నియామకానికి వాటాదారుల ఆమోదం అవసరం.
