కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు.. ‘తొలి ప్రేమ కథ’ టీజర్ విడుదల!

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు.. ‘తొలి ప్రేమ కథ’ టీజర్ విడుదల!

సాత్విక్ వర్మ, అనీ హీరో, హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న  చిత్రం ‘తొలి ప్రేమ కథ’.  సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వంలో  లతా కె నిర్మిస్తున్నారు.  తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన డైరెక్టర్ శైలేష్ కొలను,  హీరో ఆకాష్ పూరి.. టీజర్ చాలా బాగుందని,  ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరారు.   హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ ‘ఇదొక  మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ.  ధ్రువన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది.  అందరూ  మా సినిమాని సపోర్ట్ చేసి ఘనవిజయం చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  

డైరెక్టర్ సాయి లక్ష్మణ్  మాట్లాడుతూ ‘ఈ కథ అనుకున్నప్పుడే సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఊహించుకున్నా.  ఇందులోని  విజువల్స్, మ్యూజిక్  అందరికీ నచ్చుతాయి.   చాలా అద్భుతమైన లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  షూట్ చేశాం.  అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులంతా  సినిమాని చూసి  సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  మ్యూజిక్ డైరెక్టర్  ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులోని సంగీతం కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది’ అని  చెప్పాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.