‘కొబ్బరిమట్ట’ రీ–రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి థియేటర్లలో నవ్వుల సందడి!

‘కొబ్బరిమట్ట’ రీ–రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి థియేటర్లలో నవ్వుల సందడి!

సంపూర్ణేష్ బాబు హీరోగా, సాయి రాజేష్  రూపొందించిన కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘కొబ్బరిమట్ట’. 2019లో విడుదలై  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రలు పోషించారు.  నవంబర్ 14న  ఈ సినిమాను  రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా  నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయి రాజేష్ మాట్లాడుతూ  నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ‘కొబ్బరిమట్ట’  ఎంతో స్పెషల్ మూవీ.  ఈ సినిమా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ విజయం మాకు ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని అందించింది. సినిమాకున్న పవర్ ఏంటో ఆ రోజు తెలిసింది. నాకు బేబి, చెన్నై లవ్ స్టోరీస్ విజయాలు సంతోషాన్నిచ్చినా  ‘కొబ్బరిమట్ట’ అందించిన విజయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నారు.  సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ‘చాలా మంది  ‘కొబ్బరిమట్ట’  రీ రిలీజ్ చేయమని నన్ను ఇప్పటికీ అడుగుతున్నారు.  సాయి రాజేష్ అన్నతో ఈ విషయం చెబితే మంచి డేట్ చూసుకుని రీ రిలీజ్ చేద్దామని చెప్పారు. అది ఈ నెల 14కు కుదిరింది. దగ్గరలోని థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మా సినిమాను ఎంజాయ్ చేయండి’ అని చెప్పాడు.   హీరోయిన్ ఇషికా సింగ్ చిత్ర నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంది.