‘రామాయణం’ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెక్కిన బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. దర్శకుడిగా మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాను నటుడిగా కొనసాగేది మరో పదేళ్లు మాత్రమేనని, ఆ తర్వాత తన ఫోకస్ పూర్తిగా డైరెక్షన్‌పై ఉండబోతోందని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు రణబీర్. ఇప్పటికే ఓ స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టానని, గత కొన్ని నెలలుగా దీనిపై వర్క్ చేస్తున్నానని చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ సీక్వెల్, యానిమల్ 2, రామాయణం పార్ట్ 2 పూర్తయ్యాక, రాబోయే మూడేళ్లలో డైరెక్టర్‌గా మొదటి అడుగు వేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశాడు.
అయితే తాను డైరెక్ట్ చేయబోయే ఫస్ట్ మూవీలో హీరోగా మాత్రం నటించనని చెప్పాడు. లైఫ్ ఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్, రాజ్‌కుమార్ హిరానీ సినిమాల తరహాలో ఫీల్-గుడ్ ఫ్యామిలీ డ్రామాలు తీయడం ఇష్టమని అన్నాడు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు రణబీర్ కపూర్. దీని తర్వాత మూడు సీక్వెల్స్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న రణబీర్.. ఇలా యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి డైరెక్షన్ వైపు వెళ్తాననడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
