హైదరాబాద్‌‌‌‌లో యూఎస్ పోలో కొత్త స్టోర్

హైదరాబాద్‌‌‌‌లో యూఎస్ పోలో కొత్త స్టోర్

దక్షిణ భారతదేశంలో రిటైల్ కార్యకలాపాలను విస్తరిస్తున్న యూఎస్ పోలో అసోసియేషన్ హైదరాబాద్‌‌‌‌లోని హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌లో కొత్త ఐడెంటిటీ స్టోర్‌‌‌‌ను ఆరంభించింది. దీనిని నటుడు అఖిల్ అక్కినేని ప్రారంభించారు.

పురుషులు, పిల్లల దుస్తులతో పాటు ఫుట్​వేర్​ విభాగంలోనూ విస్తృత శ్రేణి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దక్షిణాదిలో షర్టులకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా షర్ట్ బార్‌‌‌‌ను ఏర్పాటు చేశారు.