మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ నయన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘ఇలాంటి చిన్న సినిమాకు ప్రైమ్ ఏరియాల్లో థియేటర్స్ దొరకడం కష్టం.
అయినా నా మీద నమ్మకంతో మంచి సెంటర్స్ పడ్డాయి. కానీ ప్రేక్షకులే థియేటర్స్‌కు రావాలంటే ఆలోచిస్తున్నారు. వారం తర్వాత చూద్దాం, పది రోజుల తర్వాత చూద్దామని అనుకుంటున్నారు. అలా అనుకుంటే మంచి సినిమాను థియేటర్లో మిస్ అవుతూనే ఉంటారు. పిల్లలతో మా సినిమాకు వస్తే మంచి విషయాలు నేర్చుకుంటారు. పిల్లలకు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. పెద్దల నుంచి పిల్లల దాకా ఎవరినీ డిజప్పాయింట్ చేయం’ అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, కుటుంబ సమేతంగా థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు తమ అనుభవాలను పంచుకుంటూ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే మంచి ఎమోషనల్ మూవీ ఇదని అన్నారు.
