- కోల్కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం, జస్టిస్ ఆన్ వీల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పంపిణీ, తేనెటీగల పెంపకం వంటి సింగరేణి వినూత్న సీఎస్ఆర్కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కోల్ ఇండియా లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీలలో బొగ్గు రంగ సంస్థల కోసం ప్రత్యేక కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) విధానంపై 2 రోజుల సామర్థ్యాభివృద్ధి శిక్షణ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి తరఫున డీజీఎం నిమ్మ భాస్కర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎస్.ఎం.డి. గౌస్ పాషా పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సింగరేణి అమలు చేస్తున్న వినూత్న, ప్రజోపయోగ కార్యక్రమాల పట్ల కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
