నేటి (నవంబర్ 8, 2026) నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ అప్లికేషన్లు

నేటి (నవంబర్ 8, 2026) నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల సొసైటీ ద్వారా పీజేటీఏయూ అనుబంధ కాలేజ్ ల్లోని బీఎస్పీ అగ్రికల్చర్ లో అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆదివారం నుంచి ఈనెల 13 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.

ఇంటర్మీడియెట్ (బైపీసీ గ్రూప్‌‌‌‌‌‌‌‌) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతో ఈఏపీసెట్–2026 పరీక్షలో అర్హత  సాధించిన వారికే అవకాశం ఉందన్నారు.

అప్లై చేసుకునే విద్యార్థులు తెలంగాణ బీసీ అయి బీసీ గురుకుల లేదా హాస్టల్స్ లో చదివి ఉండాలన్నారు. ఈ స్పాన్సర్డ్ సీట్లులో ప్రవేశం కోసం https://ug.mjptbcwreis.net ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.   వివరాల కోసం 040–23328266 నంబరు ద్వారా సంప్రదించాలన్నారు.