Childrens Special: నారంశెట్టి బాలసాహిత్య పీఠం.. నవంబర్ 14న బాలల కథల పోటీ

Childrens Special: నారంశెట్టి బాలసాహిత్య పీఠం.. నవంబర్ 14న బాలల కథల పోటీ

నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రాంతానికి చెందిన నారంశెట్టి బాలసాహిత్య పీఠం బాలల కథల పోటీ - 2026 నిర్వహిస్తోంది. ప్రథమ బహుమతి రూ.3,000, ద్వితీయ బహుమతి రూ.2,000, తృతీయ బహుమతి రూ. 1000- మరియు మరో పది కథలకు ప్రోత్సాహక బహుమతిగా రూ. 500 చొప్పున ఉంటాయి.

 కథావస్తువు ఆధునిక తరం పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇతివృత్తం ఏదైనా ఫరవాలేదు. ఒక రచయిత ఎన్ని కథలైనా పంపవచ్చు. కథ 500 పదాలకు మించకూడదు. కథలన్నీ సంకలనంగా ప్రచురిస్తారు. యూనికోడ్‌‌‌‌లో టైప్ చేసిన కథను [email protected] కు మెయిల్ చేయాలి .  ఇతర మాధ్యమాల్లో ఇప్పటికే ప్రచురితమైన లేదా పరిశీలనలో ఉన్న కథలను పంపకూడదు. కథతో హామీ పత్రం జతచేయాలి. కథలు పంపడానికి చివరి తేదీ నవంబరు 20, 2026. వివరాలకు 9490799203  నంబరుకు వాట్సప్ లో సంప్రదించవచ్చు. 

నారంశెట్టి ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు , నారంశెట్టి బాల సాహిత్య పీఠం, పార్వతీపురం.