హిందూ సంప్రదాయంలో పురాణాల ప్రకారం కార్తీకమాసం దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. నిత్యం ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దీపారాధనకు ఉపయోగించే వత్తి... నూనె .. దీపం వెలుగు కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీపారాధనలో ఉపయోగించే నూనెను బట్టి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
ఆవు నెయ్యి దీపారాధన: ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో తులసిమొక్క దగ్గర, దేవుడి మందిరంలో ఆవు నెయ్యి దీపం వెలించాలి. ఇలా చేయడం వలన మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతుంది.
నువ్వుల నూనె: హిందువులు చాలా మంది నిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. శనివారం నువ్వులనూనె దీపారాధానకు చాలావిశిష్టత ఉంది. శని గ్రహ ప్రతికూల ప్రభావాలు తగ్గడం...కర్మ దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో ప్రతికూలత తొలగిపోవాలని కోరుకునేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. అయితే పడమర దిశలో దీపం వెలిగించడం చాల విశేషమని చెబుతారు.
ఆవ నూనె : నార్త్ లో ఎక్కువుగా ఆవ నూనెతో దీపారాధన చేస్తారు. హనుమంతుడు, కాలభైరవుడి ఆరాధనలో ఆవనూనెను ఉపయోగిస్తారు. ఈ నూనెతో దీపం వెలిగించడం వల్ల భయాలు, అడ్డంకులు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. . దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
కొబ్బరి నూనె: వినాయకుడి దగ్గర దీపారాధనకు కొబ్బరినూనెను ఉపయోగిస్తారు. బుధవారం రోజున గణేషుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన కుటుంబంలో ప్రశాంతత, సుఖ సంతోషాలు కలుగుతాయి.
పంచదీపం నూనె: ఐదు రకాల నూనెలు, నెయ్యి కలిపి దీపారాధనచేయడం వలన ప్రతికూల శక్తులు తొలగుతాయి. ఆవు నెయ్యి, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆముదం, వేపనూనె లేదా విప్పనూనె మిశ్రమాన్ని ఉపయోగించి దీపారాధన చేస్తారు. పండుగలు, ప్రత్యేక పూజలు, శుభకార్యాల సమయంలో పంచ నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సామరస్యం, శుభం కలుగుతాయి.
దీపారాధనకు పాటించాల్సిన నియమాలు
- దీపం వెలిగించేటప్పుడు శుభ్రమైన ప్రమిదను ఉపయోగించాలి.
- దీపారాధన ప్రమిద లేదా దీపారాధన కుందీలో ఒత్తి వెలిగేందుకు సరిగా అమర్చాలి.
- దీపారాధనను ప్రశాంతమైన మనసుతో దైవాన్ని స్మరిస్తూ దీపారాధన చేయాలి.
- ఏ నూనెతో దీపం వెలిగించినా భక్తి, శ్రద్ధ, స్వచ్ఛమైన మనసు ముఖ్యం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
