Naga Chaitanya: వృషకర్మ నుంచి 'స్వాగ్ ఆఫ్ అర్జున్' సాంగ్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో నాగచైతన్య!

Naga Chaitanya: వృషకర్మ నుంచి 'స్వాగ్ ఆఫ్ అర్జున్' సాంగ్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో నాగచైతన్య!

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం'వృషకర్మ'. మైథలాజికల్ థ్రిల్లర్, అడ్వెంచర్ అంశాల మేళవింపుతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సందర్భంగాఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'స్వాగ్ ఆఫ్ అర్జున్' ను  మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది సినీ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటలో నాగచైతన్య సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అర్జున్ పాత్రలో ఆయన చూపిస్తున్న యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. 'కాంతార', 'విరూపాక్ష' వంటి చిత్రాలతో తన సంగీతంతో మ్యాజిక్ చేసిన అజనీష్.. ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. అభినవకవి సాహిత్యం అందించారు.

ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. రగుల్ డి. హెరియన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు అదనపు బలంగా నిలవనున్నాయి. భారీ సెట్స్, గుహల నేపథ్యంలో సాగే విజువల్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ 'వృషకర్మ' డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. మరి అర్జునుడిగా చైతన్య ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి..