హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా..భర్తలు తెస్తరు.. భార్యలు అమ్ముతరు..!

హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా..భర్తలు తెస్తరు.. భార్యలు అమ్ముతరు..!
  • అల్వాల్​లో 163 బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరు మహిళలు అరెస్ట్​

అల్వాల్, వెలుగు: మేడ్చల్​మల్కాజ్​గిరి జిల్లా అల్వాల్ ప్రాంతంలో డిఫెన్స్ మద్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది. మాజీ సైనికులు క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకు తెస్తున్న మద్యాన్ని, వారి భార్యలు ఇండ్ల వద్ద విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో తేలింది. అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బృందాలు శనివారం దాడులు నిర్వహించాయి. మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

లోతుకుంట సరస్వతీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన్యం రామాంజనేయులు, నాగప్రసన్న దంపతులు అక్రమంగా విక్రయిస్తున్న 96 బాటిళ్లను పట్టుకున్నారు. నాగప్రసన్నను అరెస్టు చేశారు. అలాగే, న్యూ బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సౌజన్య కాలనీలో ముసిమి లెంక ఇంట్లో నిల్వ ఉంచిన 67 బాటిళ్లను సీజ్ చేసి, ఆమెను అరెస్ట్​చేశారు. ఇద్దరినీ అల్వాల్​ఎక్సైజ్​స్టేషన్​లో అప్పగించినట్లు తెలిపారు. 

ఈ రెండు కేసుల్లో పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.2.11 లక్షలు ఉంటుందని మల్కాజ్​గిరి ఎన్​ఫోర్స్​మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్​రావు, ఎక్సైజ్ స్టేట్ టాస్కఫోర్స్(టీమ్ బీ) సీఐ గణపతిరెడ్డి తెలిపారు.