పంచాయతీ సెక్రటరీ లకు స్పౌజ్ డిప్యుటేషన్ల ఊరట..64 మందికి వెసులుబాటు కల్పించిన సర్కార్

పంచాయతీ సెక్రటరీ లకు స్పౌజ్ డిప్యుటేషన్ల ఊరట..64 మందికి వెసులుబాటు కల్పించిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పౌజ్ (భార్యాభర్తల) కేటగిరీ కింద బదిలీల కోసం ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వేర్వేరు జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ కుటుంబ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న 64 మంది పంచాయతీ కార్యదర్శులను 'ఆన్ డ్యూటీ' (ఓడీ) ప్రాతిపదికన డిప్యుటేషన్‌‌‌‌పై పంపుతూ శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమను జీవిత భాగస్వామి ఉండే ప్రాంతాలకు డిప్యుటేషన్‌‌‌‌పై పంపాలని కోరుతూ పలువురు కార్యదర్శులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన కమిషనరేట్.. డీపీవోల నివేదికల ఆధారంగా ఖాళీలు ఉన్న జిల్లాలకు వారిని కేటాయించింది.