విద్యారంగంలో రాష్ట్రం రోల్ మోడల్..సర్కారు బడులను బలోపేతం చేస్తం: డిప్యూటీ సీఎం భట్టి

విద్యారంగంలో రాష్ట్రం రోల్ మోడల్..సర్కారు బడులను బలోపేతం చేస్తం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్​టీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల15న హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించనున్న ‘రాష్ట్ర విద్యా మహాసభ’ పోస్టర్‌‌‌‌ను శనివారం ప్రజాభవన్‌‌‌‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 

ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య మాట్లాడుతూ. 15న ఖైరతాబాద్‌‌‌‌లోని ఇంజనీర్స్ భవన్‌‌‌‌లో నిర్వహించే రాష్ట్ర విద్యా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో విద్యారంగంలో సంస్కరణలు, టీచర్ల పెండింగ్ సమస్యలు తదితర విషయాలపై చర్చిస్తామని తెలిపారు. సంఘం నేతలు పి. రామమూర్తి, ఎస్‌‌‌‌కే మన్సూర్ అలీ, లచ్చిరాం, బండి నర్సిములు, కుర్ర యాదగిరి, మద్దెల రాజేశం తదితరులు పాల్గొన్నారు.