త్వరలో నిజామాబాద్‌‌‌‌ కు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్!

త్వరలో నిజామాబాద్‌‌‌‌ కు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్!

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌లో పర్యటించాలని తాను చేసిన విజ్ఞప్తికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌‌‌‌ నబీన్‌‌‌‌ సానుకూలంగా స్పందించారని ఎంపీ ధర్మపురి అర్వింద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీకి ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. 

బీజేపీ జాతీయ నాయకత్వం నిజామాబాద్‌‌‌‌లో పర్యటిస్తే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన నితిన్ నబీన్ ప్రస్తుతం తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు కాలేదని, ఖరారైన వెంటనే అక్కడ యాత్ర నిర్వహిస్తానని నితిన్‌‌‌‌ చెప్పారన్నారు.